Asianet News TeluguAsianet News Telugu

దక్షిణ భారత యూత్ ఐకన్ గా నటి కీర్తి సురేష్

  • దక్షిణాది యూత్ ఐకన్ అవార్డ్ దక్కించుకున్న కీర్తి సురేష్
  • అవార్డ్ ఫంక్షన్ నిర్వహించిన రిట్జ్ పత్రిక నిర్వాహకురాలు అరుణ
kirthi suresh is south indian youth icon

తెలుగులో తాజా హీరోయిన్లలో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఏకంగా మహానటి సావిత్రి పాత్రను దక్కించుకున్న కీర్తి ఇటు తెలుగులోనే కాక తమిళంలో కూడా స్టార్ డమ్ సంపాదించింది. తాజాగా కీర్తి సురేష్ దక్షిణ భారత యూత్‌ ఐకాన్‌ అవార్డు నటి కీర్తీసురేశ్‌ను వరించింది.

 

ది రిట్జ్‌ స్టైల్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం పెరంబూరు రామాపురంలోని ఓ స్టార్ హోటల్‌లో ఆడంబరంగా జరిగింది. దక్షిణాదికి చెందిన సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ అవార్డుల కార్యక్రమాన్ని రిట్జ్‌ పత్రిక సంస్థ నిర్వాహకురాలు అరుణ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ అవార్డుల వేదికపై యువ నటి కీర్తీసురేశ్‌ సౌత్‌ ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డును అందుకున్నారు.

 

ఈ సందర్భంగా అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని కీర్తి పేర్కొంది. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు శివకార్తీకేయన్‌ మాట్లాడుతూ అవార్డులు కళాకారులకు ప్రోత్సాహకంగా ఉంటాయన్నారు. అలాగని వాటిని తలకెక్కించుకోరాదని పేర్కొన్నారు. నటి కేథరిన్‌ ట్రెసా, సంగీతదర్శకుడు అనిరుద్, నటి, మిస్‌ ఇండియా శోభిత ధూళిపాళ, క్రికెట్‌ క్రీడాకారుడు అమిత్‌ మిశ్రా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios