బిగ్ బాస్2 పై కిరీటి: తేజస్వి-సామ్రాట్ స్నేహం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందేమో!

kireeti damaraju on about tejaswi samrat friendship
Highlights

బిగ్ బాస్2 లో తేజస్వి-సామ్రాట్ ల మద్య ఎఫైర్ పై కిరీటి కామెంట్.. ఇప్పటి జెనరేషన్ లో హగ్ చేసుకోవడం కామన్ విషయం.. హగ్ చేసుకుంటున్నారని అఫైర్ ఉందని అనలేం. కానీ వారిద్దరి మధ్య స్నేహం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందేమో అనిపిస్తుంది. 

 

బిగ్ బాస్2 మూడో వారంలో ఎలిమినేట్ అయిన కిరీటీ దామరాజు ఇప్పుడు ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరీటి హౌస్ లో సాగుతున్న ఎఫైర్ల గురించి ప్రస్తావించారు. తేజస్వి-సామ్రాట్, అలానే తనీష్-దీప్తి సునయనల మధ్య ఏదో జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న సభ్యులతో పాటు ఆడియన్స్ కు కూడా ఇవే సందేహాలు ఉన్నాయి.

బయటకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే సన్నిహితంగా మేలుగుతుండడం అనుమానాలకు దారి తీస్తోంది. ఈ విషయంపై కిరీటీ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ''సీజన్1 తో పోలిస్తే సీజన్2లో దాదాపు అందరూ యూతే.. బాబు గోగినేని గారి తప్పించి అందరూ యంగర్ జెనరేషన్ అనే చెప్పాలి.  కాబట్టి ఎఫైర్ల గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. తేజస్వి-సామ్రాట్ క్లోజ్ గానే ఉంటారు. అది నేను స్నేహం అనే అనుకుంటున్నాను. హగ్ చేసుకుంటున్నారు అంటారా ఇప్పుటి రోజుల్లో హగ్ అనేది చాలా కామన్. నేను హౌస్ నుండి వచ్చేశాను కాబట్టి వారి రిలేషన్ ఎక్కడ వరకు వెళ్తుందో నేను చెప్పలేను. బహుశా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం ఉందేమో చూడాలి'' అంటూ వెల్లడించారు.

ఇదే షోలో పాల్గొన్న నటి జ్యోతి.. నాని హోస్ట్ గా బాగా చేస్తున్నాడని పొగిడింది. ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్స్ కు క్లీన్ చిట్ ఇచ్చి మరీ బయటకు పంపించడం నాకు నచ్చింది అని స్పష్టం చేశారు. 

loader