Asianet News TeluguAsianet News Telugu

సూపర్ హిట్ ‘లాపటా లేడీస్’ ఆ సినిమాకు కాపీనా, వివాదం మొదలైంది

మా సినిమాలో  ఓ సిటీ  కుర్రాడు తన విలేజ్ కు వెళ్లి పెళ్లి చేసుకుంటాడు. రైల్వేస్టేషన్ దగ్గర కొత్త పెళ్లి కూతురుతో మిస్ అవుతుంది. ఆమెను అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చోమని,  తను ఓ  ఇన్ఫర్మేషన్ అడుగుదామని కౌంటర్ కి వెళ్లి వచ్చేలోగా ఇది జరుగుతుంది. 
 

Kiran Rao Laapataa Ladies faces plagiarism accusations jsp
Author
First Published May 11, 2024, 11:47 AM IST

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రోడ‌క్ష‌న్ నుంచి వచ్చే  సినిమాలకు సెపరేట్ క్రేజ్, బజ్ ఉంటుంది.   గతంలో ఆయన ప్రొడక్షన్‌లో వచ్చిన, దోబీ ఘాట్ , తారే జమీన్ పర్ , సీక్రెట్ సూపర్ స్టార్  , దంగల్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ లు క్రియేట్ చేసాయి. ఇదిలా ఉండ‌గా.. త‌న ప్రొడక్షన్‌లో వ‌చ్చిన  తాజా చిత్రం ‘లాపటా లేడీస్’ (Laapataa Ladies). అమీర్‌ ఖాన్ మాజీ భార్య కిర‌ణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా న‌టించగా.. మరో కీల‌క పాత్ర‌లో భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ కనిపించారు. థియేటర్ లో సెన్సేషన్ గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గా ఓటిటిలోనూ వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు కాపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఫిల్మ్ మేకర్, నటుడు అనంత్ మాధవన్ ... ఈ చిత్రం పూర్తిగా 1999 లో వచ్చిన   Ghunghat Ke Pat Khol ని పోలి ఉండటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... " నేను ‘లాపటా లేడీస్’ సినిమా రీసెంట్ గా చూసాను. సినిమా ప్రారంభం నుంచి చాలా సంఘటనలు, సీన్స్   Ghunghat Ke Pat Khol లాగ ఉండటం ఆశ్చర్యం కలిగించింది ," అని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో అన్నారు.

అలాగే .. 1999 లో వచ్చిన ఆ సినిమా నుంచే చాలా ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ ని  ‘లాపటా లేడీస్’లో లేపారు. సినిమా ప్రారంభం యాజటీజ్ గా Ghunghat Ke Pat Khol ని గుర్తు తెస్తుంది. మా సినిమాలో  ఓ సిటీ  కుర్రాడు తన విలేజ్ కు వెళ్లి పెళ్లి చేసుకుంటాడు. రైల్వేస్టేషన్ దగ్గర కొత్త పెళ్లి కూతురుతో మిస్ అవుతుంది. ఆమెను అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చోమని,  తను ఓ  ఇన్ఫర్మేషన్ అడుగుదామని కౌంటర్ కి వెళ్లి వచ్చేలోగా ఇది జరుగుతుంది. 

అతను తిరిగి వెనక్కి వచ్చి పొరపాటున తన భార్యే అనుకుని వేరే పెళ్లి కూతురుని తీసుకెళ్లిపోతాడు అని చెప్పుకొచ్చారు.  అయితే అక్కడ నుంచి  ‘లాపటా లేడీస్’వేరే రకంగా కథ టర్న్ తీసుకుంది. అయితే మరో సీన్ లో పోలీస్ లు ఫొటోలోని పెళ్ళి కూతురుని గుర్తు పట్టలేరు. ఎందుకంటే ఆమె ముసుగులో ఉంటుంది. అది కూడా మా సినిమాలోదే లిఫ్ట్ చేసి వాడుకున్నారని చెప్పుకొచ్చారు. 

మొన్నటిదాకా తమ సినిమా యూట్యూబ్ లో ఉండేదని, హఠాత్తుగా మిస్టీరియస్ గా ఆ సినిమా యూట్యూబ్ లో లేకుండా మాయమైందని అన్నారు.  తను ఈ విషయమై అమీర్ ఖాన్ తో మాట్లాడుకున్నాను కానీ ఆయన్ను రీచ్ కాలేకపోయానని అన్నారు. యూట్యూబ్ లో కూడా తమ సినిమా లేకపోవటంతో ఇప్పుడు తమకు ప్రూఫ్ అనేది లేకుండా పోయిందని విచారంతో అన్నారు.  కిరణ్ రావు ఈ విషయమై ఇంకా స్పందించలేదు. అలాగే అనంత్ మాధవన్..అమీర్ ఖాన్ సినిమాల్లో నటుడుగా చేసారు. వాటిలో  Mann, Akele Hum Akele Tum, Ishq వంటివి ఉన్నాయి.

  ‘లాపటా లేడీస్’కథ విషయానికి వస్తే... కొత్త‌గా పెళ్లి అయిన ఓ జంట‌ పెళ్లి అనంత‌రం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విష‌యం తెలియ‌క వ‌రుడు త‌న భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వ‌చ్చిన చూసిన అనంత‌రం త‌న భార్య కాద‌ని షాక్ అవుతాడు. దీంతో త‌న భార్య పోయింద‌ని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే త‌న భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వ‌చ్చిన అమ్మాయి ఎవ‌రు. ఆ త‌ర్వాత ఏర్ప‌డిన ప‌రిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా  వచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios