యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavarm) నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. ఈ చిత్రం తన అన్నయ్యకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యం లోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ PC 524.". ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ వంటి డిఫరెంట్ కథలని సెలెక్ట్ చేసుకుంటూ నటుడుగా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు కిరణ్ ఆబ్బవరం. తాజాగా రేచీకటి కాన్సెప్ట్ తో ఛాలెంజ్ గా ‘సెబాస్టియన్ PC 524’ చిత్రంలో సరికొత్త పాత్రలో నటించాడు కిరణ్. ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై బి . సిద్దారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు, ట్రైలర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. మార్చిన 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లలో రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్, చెర్రీ, సీనియర్ నటుడు సాయి కుమార్, హీరోలు అడవి శేష్ ,ఆకాష్ పూరి,సప్తగిరి, నిర్మాత కోడి దివ్య,లిరిక్స్ రైటర్ భాస్కర పట్ల హాజరయ్యారరు. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. ‘సెబాస్టియన్ పిసి524’ మొదటి బిగ్ టికెట్ ను హీరోలు అడవి శేష్, ఆకాష్ పూరిలు విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో హీరో కిరణ్ మాట్లాడుతూ ‘ఎక్కడో ఊర్లో టికెట్ కొనుక్కొని సినిమా చూసే నన్ను హీరోను చేసి వెళ్లిపోయిన మా అన్నకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను’ అంటూ కాస్తా ఎమోషనలయ్యారు.
అనంతరం నటుడు సాయికుమార్ మాట్లాడుతూ ..ఈ సినిమాలోని రాజాధిరాజా పాట చూస్తుంటే నాకు అమ్మంటే అనే పాట గుర్తుకొస్తుందన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ..ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది.కిరణ్ మంచి కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాడని అభినందించాడు. అడవి శేష్ మాట్లాడుతూ.. కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం.ఈ ఫంక్షన్ కు నేను కిరణ్ అభిమానిగా వచ్చాను. ఎందుకంటే కిరణ్ తీసిన 1991 షార్ట్ ఫిల్మ్ చూసినపుడు ఇలాంటి సినిమా నేను చెయ్యాలి అనుకున్నాను. ఎవరూ చెయ్యని ఢిఫరెంట్ కథలను నేను చెయ్యాలి అనుకున్నపుడు తను చేయడం చూసి కిరణ్ పై ఇష్టం ఏర్పడింది. ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నాను. హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. కిరణ్ పెరఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం.తమిళ్ లో శివకార్తికేయన్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రోజు పెద్ద స్టార్ అయ్యాడు. కిరణ్ కూడా తనలా బిగ్ స్టార్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు.
