`బ్రహ్మా ఆనందం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆడపిల్లలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెమ్మదిగా రచ్చ చేస్తున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ మెగాస్టార్‌కి మతిపోయే కౌంటర్‌ ఇచ్చింది.   

మెగాస్టార్‌ చిరంజీవి ఆ మధ్య ఆడపిల్లలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అప్పట్లోనే అది పెద్ద సంచలనంగా కాగా, ఇప్పుడు మరోసారి అగ్గిరాజేసింది మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ. ఆమె చిరంజీవి వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

దాదాపు 20 రోజుల తర్వాత చిరంజీవి వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా మెగాస్టార్‌ కి కౌంటర్‌ ఇచ్చింది. ఆ పేరెంట్స్ ని చూసి నేర్చుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

`బ్రహ్మా ఆనందం` ఈవెంట్‌లో నోరు జారిన చిరంజీవి..

మరి చిరంజీవి ఏమన్నాడు, కిరణ్‌ బేడీ ఏం కౌంటర్‌ ఇచ్చిందనేది చూస్తే. ఆ మధ్య హ్యాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన `బ్రహ్మా ఆనందం`మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా చిరంజీవి వెళ్లారు. అందులో తండ్రులు, తాతలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది.

క్లీంకార తాతగారిని చూపించండి అని యాంకర్‌ సుమ అడిగింది. దీనికి చిరంజీవి స్పందించారు. ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, వారిని చూస్తుంటే, కొన్నిసార్లు లేడీస్‌ హాస్టల్‌లో వార్డెన్‌లాగా ఉంటుందనిపిస్తుంది అని చిరంజీవి అన్నారు. 

ఈ సారైనా ఒక్క మగపిల్లాడిని ఇవ్వరా అని రామ్‌ చరణ్‌ని అడుగుతున్నాను. ఎందుకంటే తమ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక్క మగాడు కావాలని చిరంజీవి కోరుకున్నారు. అదే సమయంలో మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అని భయంగా ఉందని మనసులో మాటని ఫన్నీవేలో చెప్పాడు చిరంజీవి. కానీ ఆయన వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద దుమారం రేపాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు చిరు. చాలా మంది ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. 

చిరంజీవికి మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ కౌంటర్‌..

ఇన్నాళ్లకి మాజీ ఐపీఎస్‌ అధికారి, రాజకీయ నాయకురాలు కిరణ్‌ బేడీ స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్‌ వేశారు. సోషల్‌ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. చిరంజీవి ఆ రోజు చేసిన కామెంట్లకి సంబంధించిన పేపర్‌ క్లిప్‌ ని ట్యాగ్‌ చేస్తూ, ఆ ఆడపిల్లల పేరెంట్స్ ని చూసి నేర్చుకోండి అంటూ రియాక్ట్ అయ్యారు.

ఆ పేరెంట్స్ ని నేర్చుకోండి చిరంజీవిః కిరణ్‌ బేడీ పోస్ట్ వైరల్‌

`చిరంజీవిగారూ కూతురు కూడా వారసురాలేనని నమ్మండి. ఎందులోనూ వారు తక్కువ కాదని గ్రహించండి. అదంతా మీరు కూతురుని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి.

వారిని బాగా చూసుకుంటే, కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు, వారు ఎవరి కోసం పనిచేసినా, సేవ చేసినా వారి జీవితాలను సమానంగా మెరుగుపరిచారు` అని తెలిపింది కిరణ్‌ బేడీ.

Scroll to load tweet…

చిరంజీవిని ఉద్దేశించి ఆమెచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. చిరంజీవి మరోసారి టార్గెట్‌ అయ్యారు. ఇదే ఛాన్స్ గా తీసుకుని ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. మొత్తంగా మెగాస్టార్‌ నోరు జారిన పర్యావసానం ఆయన్ని నెమ్మదిగా వెంటాడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషల్‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

read  more: సాయి పల్లవి బెస్ట్ డాన్సర్‌ అవ్వడానికి కారణం అయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!

also read: దేశంలోనే వేల కోట్ల అధిపతి వలలో ఐశ్వర్య రాయ్! ఎవరా కుబేరుడు?, ఏం జరిగింది?