తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఇష్యూ తర్వాత టాలీవుడ్‌లో పవన్‌కు సపోర్ట్‌గా నిలిచేవారే కరువయ్యారు. ఒకరిద్దరు చిన్న హీరోలు తప్పించి... పెద్ద తలకాయలు కనీసం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరైన కింగ్ నాగార్జున స్పందించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఇష్యూ తర్వాత టాలీవుడ్‌లో పవన్‌కు సపోర్ట్‌గా నిలిచేవారే కరువయ్యారు. ఒకరిద్దరు చిన్న హీరోలు తప్పించి... పెద్ద తలకాయలు కనీసం స్పందించలేదు.
ఈ నేపథ్యంలో నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరైన కింగ్ నాగార్జున.. ఈ వ్యవహారంపై స్పందించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఇటీవల రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ చిత్రబృందం హైదరాబాదులో మ్యాజికల్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఓవైపు గులాబ్ తుపాను, మరోవైపు కరోనా... ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని కింగ్ పేర్కొన్నారు.
మార్చి 2020 నుంచి నేటివరకు కరోనాతో ఏడాదిన్నర గడిచిపోయిందని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేవ్‌లో బయటపడ్డాం అనుకున్నాం కానీ రెండో వేవ్ వచ్చి అణిచివేసిందని... ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించానని నాగార్జున అన్నారు. ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోందని.. కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో బాగా పోరాడాయని... కరెక్ట్ డెసిషన్స్ సరైన సమయంలో తీసుకుని ప్రజల్ని కాపాడారని నాగార్జున ప్రశంసించారు. తెలంగాణ మీద కరోనా కాస్త కనికరం చూపించిందని... ఏపీలో మాత్రం ఉధృతి ఎక్కువగా ఉండేదని ఆయన తెలిపారు. కానీ ఇవాళ ఆ వైరస్ నుంచి కూడా బయటపడ్డామని కింగ్ అన్నారు. ప్రజల్ని కాపాడటమే ప్రభుత్వాల పని అని.. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవలేదని, తెలంగాణలో థియేటర్స్ తెరిచారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో వైరస్ దృష్ట్యా పూర్తిగా తెరవలేదని.. ఆరోగ్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రుల దాకా థాంక్స్ చెబుతున్నా అన్నారు.
ఈ సందర్భంగా నాగార్జున ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎంతో ప్రేమిస్తారని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దీవెనలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని తెలిపారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు తమను మంచిచూపు చూశాయని, ఇకముందు కూడా ఆ చల్లని చూపు కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు
