Asianet News TeluguAsianet News Telugu

BiggBoss7: తేజకి కఠిన శిక్ష, డైరెక్ట్ నామినేషన్.. మీరేమైనా గుడ్డివాళ్ళా అంటూ శివాజీ, సందీప్ కి నాగ్ వార్నింగ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో సెప్టెంబర్ 30న శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం హౌస్ లో తప్పులు చేసిన వారందరికీ నాగార్జున ఒక రౌండ్ వార్నింగ్ ఇచ్చారు.

King Nagarjuna gives warning to sivaji sandeep and teja dtr
Author
First Published Sep 30, 2023, 10:23 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో సెప్టెంబర్ 30న శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం హౌస్ లో తప్పులు చేసిన వారందరికీ నాగార్జున ఒక రౌండ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా స్మైలీ ఫోటో టాస్క్ లో తేజ ప్రవర్తించిన విధానంపై నాగార్జున బాగా సీరియస్ అయ్యారు. 

చేతిలో బెల్ట్ పట్టుకుని నాగార్జున హౌస్ మేట్స్ కి కనిపించారు. నాగార్జున సీరియస్ గా ఉండడంతో హౌస్ మేట్స్ కంగారు పడ్డారు. నాగార్జున మొదలు పెట్టడమే శివాజీ, ఆట సందీప్ లని పైకి లేపారు. స్మైలీ ఫోటో టాస్క్ లో ఫోటోగ్రాఫర్ గా శివాజీ, సంచాలక్ గా సందీప్ వ్యవహరించారు. 

తేజ బెల్ట్ తో గౌతమ్ మెడని లాగుతున్నాడు. కానీ మీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. మీకేమైనా గుడ్డా అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. తాను ఒకసారి తేజని హెచ్చరించాను కానీ ఆ తర్వాత చెప్పలేదు అని శివాజీ అన్నారు. తాను ఆ టైం లో టాస్క్ ని గమనిస్తూ ఉండిపోయాను రియాక్ట్ కాలేకపోయాను అని సందీప్ అన్నారు. ఆడపిల్లలు ఒకవైపు తేజ ఆపు అంటూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ మీరిద్దరూ సైలెంట్ గా ఉన్నారు అంటూ నాగార్జున శివాజీ, సందీప్ లని గట్టిగా మందలించారు. 

తేజ పిలిచి అతడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. హర్ట్ చేసేలా గేమ్ ఆడడం ఏంటి అని ప్రశ్నించారు. అనంతరం ఇతర హౌస్ మేట్స్ అభిప్రాయం తీసుకున్న నాగార్జున తేజకి శిక్ష ఖరారు చేసారు. తేజకి జైలు శిక్ష, గౌతమ్ చెప్పిన పనులు చేయడంతో పాటు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా నామినేషన్స్ లో ఉంచుతున్నట్లు నాగార్జున తెలిపారు. తేజ తాను చేసిన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ కోరాడు. 

అనంతరం శివాజీ.. శుభ శ్రీ దగ్గరకు వెళ్లిన సంఘటన గురించి నాగార్జున ప్రస్తావించారు. శివాజీ అలా బిహేవ్ చేయడంతో ఇబ్బంది పడ్డానని శుభశ్రీ తెలిపింది. సంఘటన గమనించిన నాగార్జున ఇద్దరిదీ తప్పు లేదని కానీ లేడీస్ కి గౌరవం ఇస్తూ సైలెంట్ గా ఉండాల్సింది అని నాగార్జున అన్నారు. 

అలాగే శోభా శెట్టి ఫిజిక్ గురించి గౌతమ్ ప్రవర్తించిన తీరుని కూడా నాగార్జున ప్రశ్నించారు. గౌతమ్ చేసినది తప్పని నాగార్జున అన్నారు. అనంతరం ప్రశాంత్ కి నాల్గవ పవర్ అస్త్రని ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత నాగార్జున ఒక్కొక కంటెస్టెంట్ ని పిలిచి వారు రైజ్ చేసిన ఇష్యూ గురించి మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios