ఈ వీకెండ్ బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడవబోతోంది. శనివారమే ఒకరు ఎలిమినేట్ అయ్యా బయటకు వెళ్లబోతున్నారు. ఫుల్ ఫైర్ తో నాగార్జున ఒక్కొక్కరికి క్లాస్ పీకారు.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కొట్లాటలు.. తిట్టుకోవడాలు.. నోరు జారడాలు. హాట్ హాట్ గా నడిచింది ఈ వారమంతా..? ఇక ఈ వారం జరుగుతున్న తతంగం అంతా చూసి.. జనాలకు అప్పుడే అర్ధం అయ్యింది. వీకెండ్ నాగ్ చేతిలో వీళ్లకు జాతరే అని. ఆడియన్స్ అనుకున్నట్టుగానే అందరిమీద ఫైర్ అయ్యాడు కింగ్ నాగార్జున . ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. ముఖ్యంగా గీతు, రేవంత్, సూర్య, ఫైమా.. ఇలా అంతా నాగ్ చేతుల్లో అక్షంతలు వేయించుకున్నారు.
దానికి సబంధించి ప్రోమో బిగ్ బాస్ వదలగానే జనాలకు ఈరోజు ఎపిసోడ్ పై ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈవారం జరిగిన కెప్టెన్సీ చేపల టాస్క్ గురించి ఒక్కొక్కరికి క్లాస్ పీకాడు నాగార్జును. అందులో ప్రతీ వారం ఏం చేసినా గీతును వదిలేస్తూ.. వచ్చాడు. కాని ఈసారి మాత్రం లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. అసలు సంచాలక్ అయిన నువ్వు గేమ్ ఆడటం ఏంటీ..? అసలు నీ ఆట ఏది అక్కడ. ఇచ్చిపడేస్తానన్నావ్ ఇదేనా..? అంటూ రెచ్చిపోయాడు.
నాగార్జునకు సమాధానం చెప్పుకోలేక ఫైర్ బ్రాండ్ గీతు కూడా బిక్కముఖం వేసింది. ఈసారి నువ్వు పనిష్మెంట్ ఫేస్ చేయకు తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక రేవంత్ ను కూడా ఇదే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన నాగ్. రేవంత్ టాస్క్ లో భాగంగా లేడీస్ ను నెట్టేయడం గురించి మాట్లాడుతూ.. అది ఏదో ఆటలో తెలియ నెట్టినట్టు లేదు. కావాలని నెట్టినట్టు ఉంది. ఒక ఉన్మాదిలా ఆడావంటూ.. రేవంత్ పై రెచ్చిపోయాడు కింగ్.
ఇక మిగతా వాళ్లకు కూడా ఇదే రేంజ్ లో పడింది. ఒక ఫెమినిస్ట్ ను అన్నావ్ సూర్య ఇదేనా నీ ఆట అంటూ.. వాసంతీకి అన్యాయం చేసిన విషయంలో గట్టిగానే క్లాస్ పీకాడు. ఇక హౌస్ లో ఎప్పటికప్పుడు కామెడీతో నవ్విస్తున్న ఫైమాకు..ఒక్కోసారి కామెడీ ఎక్కువైతే ప్రమాదం.. అతి చేయవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ప్రతీ ఒక్కరికి చెమటలు పట్టేలా..సెట్ రైట్ అయ్యేలా ఇచ్చిపడేశాడు నాగార్జున.
