మాల్దీవుల వెకేషన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న నాగార్జున.. ఎవరికో భయపడి కాదు 

కింగ్ నాగార్జున డిసెంబర్ వరకు బిగ్ బాస్ తో సందడి చేశారు. సంక్రాంతికి నాగార్జున నా సామిరంగ అంటూ హంగామా చేయబోతున్నారు. 

King Nagarjuna cancelled maldives vacation tickets dtr

కింగ్ నాగార్జున డిసెంబర్ వరకు బిగ్ బాస్ తో సందడి చేశారు. సంక్రాంతికి నాగార్జున నా సామిరంగ అంటూ హంగామా చేయబోతున్నారు. నాగార్జున ఆషిక రంగనాథ్ జంటగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన నా సామిరంగ మూవీ సంక్రాంతి పండుగ వేళ ఆదివారం రోజు థియేటర్స్ లోకి రానుంది. 

ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొనివుంది. నాగార్జున ప్రస్తుతం వరుసగా ప్రచార కార్యక్రమాలతో సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో నాగార్జున ఇండియా, మాల్దీవుల మధ్య జరుగుతున్న వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అటు బిగ్ బాస్ షూటింగ్, ఇటు నా సామిరంగ షూటింగ్ లో నాగార్జున చాలా బిజీగా గడిపారు. బాగా అలసిపోయారట. దీనితో రిలాక్స్ అవుదామని బిగ్ బాస్ ముగిసిన తర్వాత మాల్దీవులకు వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అంతలో ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం మొదలయింది. దీనితో చాలా మంది ఇండియన్ సెలెబ్రిటీలు మాల్దీవుల బాయ్ కాట్ చేస్తున్నారు. 

దీనితో నాగార్జున కూడా మాల్దీవులకు బుక్ చేసుకున్న టికెట్స్ ని క్యాన్సిల్ చేశారట. ఎవరికో భయపడి తాను ఈ నిర్ణయం తీసుకోలేదని నాగార్జున అన్నారు. మాల్దీవుల మంత్రులు ఇండియాపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రధాని పై చేసిన కామెంట్స్ కూడా సరైనవి కాదు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని నాగార్జున అన్నారు. 

మాల్దీవులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న సెలెబ్రిటీల జాబితాలో నాగార్జున కూడా చేరారు. అయితే ప్రస్తుతం తాను చాలా అలసిపోయినప్పటికీ.. నా సామిరంగ చిత్రం విజయం సాధిస్తే ఆ అలసట మొత్తం పోతుంది అని అన్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios