కింగ్ నాగార్జున పేరు చెబితే గ్లామర్, ఫిట్నెస్ గుర్తుకు వస్తుంది. నాగార్జున ఏజ్ 60ఏళ్ళు దాటాయి అంటే అసలు ఎవరూ నమ్మరు. క్రమశిక్షణ, ఆహారం, వ్యాయామం నాగార్జునను మన్మధుడుగా కొనసాగిస్తున్నాయి. ఈ ఇంటెలిజెంట్ యాక్టర్ గొప్ప వ్యాపారవేత్త కూడా. ఉన్నత విద్యావంతుడు అయిన నాగ్ చాలా కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు. కాగా నాగార్జున టాలీవుడ్ లోనే అందరికంటే ఎక్కువ సంపాదన కలిగిన హీరోగా ఉన్నారని తెలుస్తుంది. 


తన తెలివితేటలతో వివిధ రంగాలలో పెట్టుబడుల ద్వారా నాగార్జున భారీగా ఆర్జిస్తున్నారట. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున రెండు సీజన్స్ కి వ్యవహరించారు. ఇక సీజన్ 5కి కూడా ఆయనే హోస్ట్ అని సమాచారం. హోస్ట్ గా స్టార్ మా నుండి నాగ్ భారీగా రాబడుతున్నాడట. ఇక అప్ కమింగ్ రైటర్స్, దర్శకులకు అవకాశాలు ఇస్తూ, వారిని ఎంకరేజ్ చేయడంతో పాటు సినిమాలు, సిరీస్ ల నిర్మాణం ద్వారా లాభాలు గడిస్తున్నారట. 

 

వీటితో పాటు స్టాక్స్ , రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా ఏడాదికి కోట్ల సంపాదన రాబడుతున్నారట నాగార్జున. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోతో పాటు అనేక చోట్ల స్థిరాస్థులు కలిగిన నాగార్జున ఆస్థి విలువ చాలానే ఉంటుంది. ఈ మధ్య నాగార్జున ఛార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశారు. ఫ్యామిలీ ప్రయాణాలకు దానినే ఉపయోగిస్తున్న నాగ్, ఖాళీగా ఉన్నప్పుడు  ఫ్లైట్ ని అద్దెకు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారట. అలా పలు మార్గాల ద్వారా సంపాదనలో దూసుకుపోతున్నారని సమాచారం.