కింగ్ ఖాన్ షూటింగ్ కి రావాలంటే హెలికాప్టర్.. అదీ కండిషన్

First Published 6, Apr 2018, 1:16 PM IST
king khan shah rukh khan needed a helicoptor to attend movie shoot
Highlights
కింగ్ ఖాన్ షూటింగ్ కి రావాలంటే హెలికాప్టర్.. అదీ కండిషన్

స్టార్ హీరోలకు బిజీ షెడ్యూల్ వుండటం సహజం. బాలీవుడ్ లో అయితే సినిమా ఈవెంట్లు,షూటింగులు, పార్టీలు..  ఇలా అన్నింటికీ టైమ్ కేటాయించాల్సి వుంటుంది కాబట్టి సమయం దొరకటం కష్టంగా వుంటుంది. బాలీవుడ్ బాద్  షా షారూక్ ఖాన్ లాంటి హీరోలకు ఆ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఫుల్ బిజీగా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
 

షారూక్ షెడ్యూల్ ఘోరంగా డ్యామేజ్ అవుతోందట. దానికి కారణం ముంబైలో రోడ్ల మీద ట్రాఫిక్. ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా.. షూటింగ్ స్పాట్ కి ఆలస్యం అవుతోందట. ప్రస్తుతం జీరో అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో యాక్ట్ చేస్తున్నాడు షారుఖ్.  ఏడాది చివరకు విడుదల చేసేందుకు షెడ్యూల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ని చకచకా ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారు. కానీ ముంబై ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుండడంతో.. రోజూ షూటింగ్ స్పాట్ కు వచ్చేందుకు.. షారూక్ ఖాన్ కు స్పెషల్ గా ఓ హెలికాప్టర్ ఏర్పాటు  చేశారట.

 

సెన్సేషన్ గా అనిపించినా ఇది నిజమే. ఎంత బిజీ అయినా.. రోజూ ఛాపర్ ఇవ్వడం అంటే చిన్న సంగతి కాదు. ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి వాళ్లు ఇలా రెగ్యులర్ గా స్పెషల్ ఫ్లైట్స్.. హెలీకాప్టర్ వాడుతుంటారు. కానీ అదేదో కారును వాడినట్లుగా.. ఏకంగా హెలికాప్టర్ లో డైలీ షూటింగ్ స్పాట్ కు వెళ్లి రావడం మాత్రం.. ఒక్క షారూక్ ఖాన్ కే చెల్లింది.

loader