సినీ తారలు అభిమానులతో చేరువగా ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా విషయాలనే కాక ఫ్యామిలీ సంగతులని కూడా కొందరు నటులు షేర్ చేస్తుంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు తారలు చేసే పోస్ట్ లు వివాదాలు మారుతుంటాయి. 

తాజాగా హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఘాటైన ఎక్స్ ఫోజింగ్ ఫోటోలని షేర్ చేసే కిమ్ ఈ సారి తన కుమార్తె షికాగో వెస్ట్ కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిమ్ కుమార్తె వెస్ట్ ఓ పాముని మేడలో వేసుకుని ఆడుకుంటున్న వీడియో ఇది. 

వెస్ట్ ఏమాత్రం భయం లేకుండా పాముతో ఆడుకుంటోంది. చిన్నపిల్లలతో ఇలాంటి ఆటలా ఆడేది అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చిన్నపిల్లలకు ఏవి విష సర్పాల్లో, విషం లేనివి ఏవో తెలియదు. వారితో ఇలాంటి ఆటలు ఆడకూడదు. ఓ నటిగా కిమ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని కామెంట్స్ పెడుతున్నారు. 

కిమ్ మాత్రం మై బ్రేవ్ గర్ల్ షికాగో అని కామెంట్ పెట్టింది. ఏమాత్రం భయం లేకుండా పాముతో ఆడుకుంటోంది అంటూ కిమ్ సోదరి ఖ్లోయి కూడా కామెంట్ పెట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My brave girl Chicago 🐍

A post shared by Kim Kardashian West (@kimkardashian) on Aug 21, 2019 at 6:45am PDT