ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ విజయ్ ఆంటోనీ, అర్జున్ ల కలయికగా తో వస్తున్న ఈ సినిమా కి భారీ డిమాండ్ ఏర్పడింది.. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది..  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు నటించిన కిల్లర్ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. 

సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..  సెన్సార్ పూర్తయ్యింది.. జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం.. అన్నారు..  నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్