నిన్నటిదాకా పూజ , రష్మిక లు, ఇప్పుడు కియారాతో సై?
కియారా అద్వానీ గుర్తుందా.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన భరత్ అనే నేను సినిమా చేసిన భామ. ఆ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. తాజగా మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ సారి తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఆమెకు ఆఫర్ వచ్చిందని తమిళ సినీ వర్గాల సమాచారం. అయితే అందులో పెద్ద విశేషం ఏముంది అంటే పూజ హెడ్గే, రేష్మికలను ప్రక్కన పెట్టి ఆమెని తీసుకోబోతున్నారట.
వివరాల్లోకి వెళితే.. తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాకి తమిళంతో పాటు తెలుగులోనూ కలెక్షన్స్ వర్షం కురిసింది. యావరేజ్ టాక్ తోనే దుమ్ము దులిపారు. ఈ నేపథ్యంలో ఇంకో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ 65వ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
ఈ సినిమా కోసం ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వాళ్లు రష్మిక మందన, పూజా హెగ్డే. అయితే ఇప్పుడు సీన్ లోకి కియారా అడ్వాణి వచ్చింది. ఆమె ఓకే అయ్యేటట్లు ఉందని సమాచారం. అయితే ఈ విషయమై అధికారికంగా సమాచారం ఏమీ లేదు. ఈ ముగ్గురిలో విజయ్‌తో కలిసి ఎవరికి ఛాన్స్ రానుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ఇక చిత్రానికి కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు - అరివులు యాక్షన్ పార్ట్ ను కొరియాగ్రాఫ్ చేయనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలో చిత్రం కనువిందు చేయనుంది. దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రంమైన కోలమావు కోకిలాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషించింది.