ఛలో, గీత గోవిందం చిత్రాలతో మాయ చేసింది రష్మిక. అందం, చలాకీతనం ఉండడంతో యువత ఫిదా అయ్యారు. రష్మికకు ఉన్న క్రేజ్ తో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. రష్మిక ఇటీవల నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం రష్మిక మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తోంది. 

తెలుగులో రష్మికకు ఉన్న క్రేజ్ తో తమిళంలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీతో రష్మిక తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉండగా ఇళయదళపతి విజయ్ సరసన నటించే ఛాన్స్ కూడా రష్మిక దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఆ వార్తపై స్పందించిన రష్మిక.. ఇంకా ఖరారు కాలేదని, ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని తెలిపింది. 

విజయ్ సరసన నటించే ఛాన్స్ ఎలాగైనా దక్కుతుందని రష్మిక ఆశలు పెట్టుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ అవకాశాన్ని కియారా అద్వానీ ఎగరేసుకుపోయిందట. విజయ్ చిత్రం కావడంతో కియారా తన డేట్స్ సర్దుబాటు చేసుకుని మరీ కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. 

దీనితో విజయ్ సరసన నటించాలనే రష్మిక ఆశలు ఫలించలేదు. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.