'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం ప్రయత్నిస్తోంది

'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం ప్రయత్నిస్తోంది. అయితే రీసెంట్ గా ఓ దర్శకుడు ఆమెను చాలా సార్లు ఏడిపించినట్లు చెప్పింది కియారా. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా..? బోయపాటి శ్రీను. రామ్ చరణ్ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినిమాలో హీరోయిన్ పాత్రకు ఓ ఎమోషనల్ సీన్ ఉంటుందట. దానికి కోసం కియారా ఏడవాల్సిఉంటుంది. ఆ సీన్ లో పెర్ఫెక్షన్ కోసం బోయపాటి ఆమెను 32 సార్లు ఏడిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా కియారా చెప్పుకొచ్చింది.

సినిమాలో కీలకమైన ఆ సీన్ కోసం తను 32 టేక్స్ తీసుకున్నానని, డైరెక్టర్ అన్ని సార్లు ఏడిపించి అప్పుడు ఫైనల్ చేశారని చెప్పుకొచ్చింది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. మరి ఈ సినిమా నటిగా కియారాకి ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి!