కియారా అద్వాని హైదరాబాద్ లో అడుగు పెట్టింది. రామ్ చరణ్ కోసం మరోసారి భగ్యనగరంలో సందడి చేయబోతోంది కియారా. ఈ సారి తాడో పేడో తేల్చుకుని వెళ్తానంటోంది.
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతుంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈసినిమా దాదాపు అయిపోవస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో .. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు ముఖ్య పాత్రదారులపై ఇంపార్టెంట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని ముంబయ్ ప్లైట్ ఎక్కిన కియారా అద్వాని.. మరోసారి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చింది. చరణ్, కియారా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చరణ్ - కియారా మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన సీన్స్ ఇందులో ఎక్కువగా ఉండబోతున్నట్టు సమాచారం.
దాదాసే 15 రోజులు హీరో హీరోయిన్ల మధ్య షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకూ బాలీవుడ్ ముద్దుగుమ్మ హైదరాబాద్ లోనే ఉండబోతుందట. అంతే కాదు కొన్ని సన్నివేశాలలో శ్రీకాంత్, సునీల్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగుతో ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. మిగిలిన షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు టీమ్.
ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా పాటల కోసం ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన సెట్స్ ను నిర్మించినట్టు సమాచారం. అంతే కాదు వీటితో పాటు మరికొన్ని ఫారెన్ లోకేషన్లలో షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీటి కోసమే బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టుగా టాక్.
