దివంగత నటి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ తనకు ఖర్ఫ్యూ విధించినట్లు చెబుతోంది. ఖుషీ కపూర్ సోదరి జాన్వి ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఖుషీ కపూర్ పై పడింది.

ఇదే విషయంపై ఓ షోలో ఖుషీని ప్రశ్నించగా.. ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అక్కలానే తనకు కూడా కరణ్ జోహార్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ఉందని.. కానీ ఈ విషయంలో నాన్న కర్ఫ్యూ విధించారని అంటోంది.

కరణ్ జోహార్ ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతాను కానీ నా తొలి సినిమాలో నేను ఎవరితో నటించాలనే విషయం మాత్రం నాన్న నిర్ణయిస్తారని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తన విషయంలో తండ్రి బోనీకపూర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పింది.

ఓసారి నాన్న నా స్నేహితురాలికి మెసేజ్ చేసి.. 'బేటా.. నువ్ ఖుషీతో కలిసి ఓ ఫోటో దిగి పంపవా' అని అడిగినట్లు తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని వెల్లడించింది. త్వరలోనే ఖుషి నటనలో శిక్షల తీసుకోవడానికి న్యూయార్క్ వెళ్లబోతున్నారు. తిరిగి వచ్చిన తరువాత కరణ్ జోహార్ నిర్మించబోయే సినిమాతో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు.