మొరగడం కుక్క స్వభావం.. శ్రీరెడ్డిపై ఖుష్బూ కౌంటర్!

khushbusundar on srireddy
Highlights

 ''మొరగడమనేది కుక్కలకు పుట్టుక నుంచి వచ్చిన స్వభావం. వాటికి స్పందించడం తెలివితక్కుతనం'' అంటూ శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. కోలీవుడ్ తారలపై శ్రీరెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలు అక్కడ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి తనను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడని నటి శ్రీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు చెన్నైకు వెళ్లి అక్కడ మీడియా ముఖంగా కోలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది.

అయితే దర్శకుడు సుందర్ సి ఈ విషయంపై స్పందించారు. శ్రీరెడ్డి ఆమెపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని ఆమెపై లీగల్ గా యాక్షన్ తీసుకోనున్నట్లు, పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీరెడ్డికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. అలానే సుందర్ సి భార్య నటి ఖుష్బూ కూడా ఈ విషయంపై తనదైన స్టైల్ లో స్పందించింది. ''మొరగడమనేది కుక్కలకు పుట్టుక నుంచి వచ్చిన స్వభావం. వాటికి స్పందించడం తెలివితక్కుతనం'' అంటూ శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది.

కోలీవుడ్ తారలపై శ్రీరెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలు అక్కడ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని పరిష్కరించే దిశగా నడిగర్ సంఘం అధినేత విశాల్ కొన్ని చర్యలు తీసుకోబోతున్నాడని సమాచారం. 

loader