అజ్ఞాతవాసి షూటింగ్ నుంచి ఖుష్బూ అవుట్

First Published 5, Dec 2017, 12:34 AM IST
khushboo sundar tweets on finishing agnyaathavaasi shooting
Highlights
  • పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి
  • అజ్ఞాతవాసి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న ఖుష్బూ సుందర్
  • తన షూటింగ్ పార్ట్ ముగియటంతో భారంగా వెళ్తున్నానంటూ ట్వీట్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలో సీనియర్‌ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సోమవారంతో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైందని, యూనిట్‌ సభ్యులను విడిచి వెళ్లడం చాలా బాధగా ఉందని ఖుష్చూ అన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

‘కొందరిని విడిచి వెళ్తూ గుడ్‌ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటి వారే ‘అజ్ఞాతవాసి’ యూనిట్‌ సభ్యులు. నా చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నా. ఇంత మంచి వ్యక్తులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. డీవోపీ మణికందన్‌ ప్రియమైన వ్యక్తి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

 

మాటల మాంత్రికుడితో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ.. ‘ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సింప్లిసిటీ, నటులను పోత్సహించి, వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టుకునే విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ‘అజ్ఞాతవాసి’లో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. ప్రియమైన సహనటుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు పవన్‌కల్యాణ్‌.. మీ అందరినీ మిస్‌ అవుతున్నా’ అని ఆమె పేర్కొన్నారు.

 

ఆజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ జంటగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో బొమన్‌ ఇరానీ, పరాగ్‌ త్యాగీ, రావు రమేశ్‌, సంపత్‌ రాజ్‌, మురళీశర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

loader