తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రిని పోగొట్టుకొని అనాధలా ఫీల్ అవుతున్నానని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

'సూర్యుని కుమారుడు అస్తమించారు, మళ్లీ ఆయన ఉదయించరు. కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు ప్రజల మనసుల్లో ఆయన పేరు అల్లుకుపోయింది. ఓ మహానేతగా ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు' అంటూ ట్వీట్ చేసి నెల రోజుల క్రితం కరుణానిధితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''నెల రోజుల క్రితం ఆయనతో కలిసి దిగిన చివరి ఫోటో ఇది.

కానీ ఇదే చివరి ఫోటో అవుతుందని, ఆ మహానేతని చూసే చివరి క్షణం అవుతుందని నేను ఊహించలేదు. మిస్ యూ అప్పా'' అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో 'ఇప్పుడు నేనొక అనాధలా ఫీల్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు.