ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్  ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర చేస్తుండగా.. మురళి శర్మ, సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 8 కోట్ల మేర బిజినెస్ జరగగా.. మొత్తంగా చూస్తే 25.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. సో.. 26.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఈ సినిమా బరిలోకి దిగుతోంది.

నైజాం 8.10 కోట్లు
సీడెడ్ 3.60 కోట్లు
ఆంధ్రా 11 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు 2 కోట్లు
ఓవర్ సీస్ 1 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 25.70 కోట్లు

నిర్మాత మాట్లాడుతూ.... "రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్‌తో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్‌ తో వస్తున్నాం. ఇది పర్ఫెక్ట్ బాలీవుడ్ సినిమా. హాలీవుడ్‌ స్టాండర్డ్ లో కొన్ని సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించాం. చాలా స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. నా సినిమాపై నాకు నమ్మకం ఉంది. సినిమా చూసిన తర్వాత చెబుతున్నాను." అన్నారు.

అలాగే మొదట్లో, ఫిబ్రవరి 11న సినిమా విడుదలపై నాకు కూడా సందేహం ఉండేది. రమేష్ వర్మ సమయానికి కంటెంట్‌ని అందిస్తారా అని నాకు సందేహం ఉంది. అయితే దాన్ని సవాల్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మేము రాత్రి కర్ఫ్యూను మరో గంట ఆలస్యం చేయడానికి అనుమతి కోరాము. అది దొరికితే ఏపీలో నాలుగు షోలు వేయొచ్చు. నైజాంలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. సోలోగా రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరి 25 వరకు మరో పెద్ద సినిమా రాకపోవచ్చు. ఖిలాడీకి పోటీ ఉండదని నా నమ్మకం. అన్నారు.