అంచనాలన్నీ అవలీలగా అందుకుని మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన మొదటివారంలోనే పంపిణీదారులకు 70 కోట్ల కలెక్షన్లు అందించింది. అంతేకాదు బాహుబలి తర్వాత తొలి వారంలో 70 కోట్ల షేర్ అందించిన సినిమాగా ఖైదీ రికార్డు సృష్టించింది. ఇప్పటికీ టికెట్ల కోసం జనం క్యూ కడుతునే ఉన్నారు. ఇలానే కొనసాగితే శ్రీమంతుడు సాధించిన రికార్డును క్రాస్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

రెండో వారం తర్వాత రెండో అతిపెద్ద హిట్ సినిమాగా ఖైదీ రికార్డు సృష్టించనుంది. రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా... పదేళ్ల గ్యాప్ తీసుకుని వచ్చినా... మెగా స్టార్ అభిమానులు మాత్రం బ్రహ్మరధం పట్టారు. సినిమమాల్లో మెగాస్టార్ కు తిరుగులేదని మరోసారి నిరూపించారు చిరంజీవి. ఇప్పటికే పోటీలో ఎవరున్నా... తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు చిరంజీవి.