Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతికి నువ్వా నేనా అంటున్న చిరు-బాలయ్య

  • సంక్రాంతికి నువ్వా నేనా అంటున్న మెగాస్టార్, నట సింహం
  • భారీ సినిమాల పోటీ మంచిది కాదని సూచించిన మెగాస్టార్
  • ఖైదీ నంబర్ 150 రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు మార్చిన రామ్ చరణ్
  • ఇద్దరు లెజెండ్స్ సినిమాలు ఆదరించాలని కోరుతున్న క్రిష్
  •  

 

KHAIDI NO 150 VS GAUTAMIPUTRA

 

ఒకప్పుడు సంక్రాంతి పండగ అంటేనే ఆ నలుగురు హీరోల సినిమాలు. నలుగురూ ఒకర్ని మించి ఒకరు పోటీపడి మరీ తమదైన సినిమాల రిలీజ్ తో ప్రేక్షకులను అలరించేవారు. ఆ నలుగురు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాను రాను బడా హీరోల సినిమాలు పోటీ పడటం తగ్గి పోయింది. కానీ దసాబ్ద కాలం తర్వాత సంక్రాంతి బరిలో మళ్లీ ఇద్దరు హీరోలు కాలు దువ్వుతున్నారు.

 

వెంకటేష్, నాగార్జున ఇద్దరూ తమ సినిమాల విడుదల కాస్త జరిపితే... సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించేసిన సినిమాలు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఒకటైతే.. మరోటి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు ఈ టాలీవుడ్ లెజెండ్స్. ఇప్పటికే ఇద్దరు లెజెండ్స్ పక్కకు తప్పుకోగా ఈ ఇద్దరు మాత్రం బరిలో నిలిచారు.

 

అయితే... రెండు భారీ సినిమాలు, అందులోనూ మెగాస్టార్ 150, బాలకృష్ణ 100వ చిత్రాలు రిలీజ్ కావటంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో యమా క్రేజ్ నెలకొంది. అయితే ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడో దశాబ్దం క్రితం ఉన్నా... ఆ తర్వాత సంక్రాంతి పుంజులు పెద్దగా పందెం వేసుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కోళ్ల పందేల మాట ఎటున్నా... చిరు, బాలయ్య మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు.

 

ఇంత ఢీ అంటున్నా మెగాస్టార్ తనదైన పెద్దరికాన్ని ప్రదర్శించారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం తెలుగు సినీ పరిశ్రమకు అంత మంచిది కాదని... తన తనయుడు, ఖైదీ నెంబర్ 150 నిర్మాత రామ్ చరణ్ కు మెగాస్టార్ సూచించారు. దాంతో మెగా మూవీ రిలీజ్ ఒక రోజు ప్రీపోన్ చేసి 11న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

 

చాలాకాలం తర్వాత టాలీవుడ్ వెండితెర మీద ఆసక్తికరపోరు నెలకొని ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగకు ముఖాముఖి తలపడుతుండటంతో అటు గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకనిర్మాత క్రిష్ కూడా పాజిటివ్ గా స్పందించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 12 తేదిల్లో విడుద చేస్తున్నారు. 'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. #jan11khaidi, #jan12GPSK  హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారిని స్వాగతిద్దాం' అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు.

 

నిజానికి ప్రస్థుతం రెండు భారీ చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అలా రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సై అంటే సై అంటున్నారు సీనియర్ స్టార్స్. ఇద్దరికీ ప్రతిష్టాత్మక చిత్రాలు కావటంతో ప్రచారం, రిలీజ్ విషయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.



ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వటం పై ఇరు చిత్రాల నిర్మాతలు స్పందించారు. ఇలా భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం గతంలో కూడా జరిగిందంటూ రామ్‑చరణ్ వివరించగా... గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాత క్రిష్. ఇద్దరినీ స్వాగతించాలంటూ కోరాడు. మరి ఎవరి సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios