మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీనెంబర్ 150 ట్యాగ్ లైన్ బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టే... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. యూఎస్ఏలో చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ కేవలం బాహుబలి మినహా మరే సినిమా సాధించని కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. టాప్ రెండో అత్యధిక గ్రాసర్ గా బాస్ 150 నిలిచింది. బుధవారం విడుదలైనా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం మాత్రం మెగా స్టార్ చిరంజీవికే చెల్లిందని చెప్పాలి.

యూఎస్ ఏలో దాదాపు 140 స్క్రీన్స్ పై మూవీ ప్రదర్శించగా 1.251 మిలియన్స్ అమెరికన్ డాలర్లు కలెక్షన్స్ సాధించింది.

 

కాగా ఇప్పటివరకు కలెక్షన్స్ లో అగ్ర భాగాన నిలిచిన 10 సినిమాలు వరుసగా ఇలా ఉన్నాయి.


1. బాహుబలి: $1.36 మిలియన్

2. Khaidi No 150: $1.251 మిలియన్

3. సర్దార్ గబ్బర్ సింగ్: $616k

4. జనతా గ్యారేజ్: $584K

5. బ్రహ్మోత్సవం: $556K

6. శ్రీమంతుడు: $536K

7. ఆగడు:  $527K

8. నాన్నకు ప్రేమతో..: $355K

9. సన్ ఆఫ్ సత్యమూర్తి: $347K

10. అత్తారింటికి దారేది: $345K