కన్నడ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ నటి సుమలత ఫైనల్ గా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో జేడీఎస్ పార్టీలో అలజడి నెలకొంది. ఆమెకు సపోర్ట్ గా KGF స్టార్ హీరో యాష్ మద్దతు పలికారు. పైగా ప్రత్యర్థి అభ్యర్థి మరో హీరో నిఖిల్ గౌడ్ ఉండడం విశేషం. 

గత కొంత కాలంగా కాంగ్రెస్ లో ఉన్న సుమలత ఈ సారి ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగా పోటీకి దిగడానికి కారణం మరో స్టార్ హీరోనే. ఇప్పుడిపుడే కన్నడ సినిమా ఫీల్డ్ లో స్టార్ హీరోగా గుర్తింపు అందుకుంటున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మాండ్యా నియోజకవర్గాన్నీ టార్గెట్ చేశాడు. 

జేడీఎస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కావున మండ్య టికెట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఇవ్వకుండా కుమారుడికి ఇవ్వడంతో సుమలత మరో పార్టీలోకి వెళ్లాలని అనుకున్నారు. ఇటీవల బీజేపీతో చర్చలు జరిపినప్పటికీ ఆమె ఫైనల్ గా ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. యాష్ తో పాటు దర్శన్ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో పాటు ఇతర సినీ ప్రముఖులు సుమలతకు మద్దతు పలుకుతున్నారు. 

తెలుగులో హిట్టయిన టాప్ తమిళ్ సినిమాలు

పాటలు పాడి స్టెప్పులేయిచ్చిన స్టార్ యాక్టర్స్