ఎక్కడ చూసినా ఇప్పుడు యాష్ పేరు చాలా స్ట్రాంగ్ వినిపిస్తోంది. శాండిల్ వూడ్  నుంచి వచ్చిన ఒక హీరో బాలీవుడ్ వరకు తన KGF సినిమాతో అందరిని ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాకు మాస్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. బాలీవుడ్ లో అయితే మొదటి వారమే 10 కోట్లను వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. 

యాష్ కి కన్నడలో ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ తెలుసుకోవాలని చాలా మంది టాలీవుడ్ కోలీవుడ్ జనాలు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే వారందరికీ విశాల్ ఒకే ఒక్క వీడియో ద్వారా  యాష్ గురించి క్లారిటీ గా చెప్పేశాడు.అన్ టోల్డ్ స్టోరీ అనే వీడియోలో అతని కెరీర్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, మంచి తనం, సహాయ గుణంతో పాటు కన్నడ రైతుల కోసం చేసిన కృషి అంతా ఆ  చూపించారు. 

గతంలో తమిళనాడు లో వరదలు వస్తే యాష్ కూడా స్పందించి తన సహాయాన్ని అందించినట్లు వీడియోలో చూపించారు. KGF సెన్సేషన్ హిట్ అందుకున్న సందర్బంగా ఈ స్పెషల్ వీడియోను ఇస్తున్నట్లు విశాల్ తన ప్రొడక్షన్ హౌస్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి ఆ వీడియోను విడుదల చేశాడు. ఆ విడియో పై మీ   రు కూడా ఓ లుక్కేయండి.