నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు: KGF యష్

First Published 12, Jan 2019, 2:42 PM IST
KGF YASH ANGRY ON FAKE NEWS
Highlights

శాండిల్ వుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.  ఐటి అధికారులు ఇటీవల నటీనటుల ఇళ్లపై రెయిడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువగా KGF హీరోపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

శాండిల్ వుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.  ఐటి అధికారులు ఇటీవల నటీనటుల ఇళ్లపై రెయిడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువగా KGF హీరోపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం అధికారుల విచారణకు హాజరైన యష్ మీడియాతో మాట్లాడాడు. 

కావాలనే కొందరు తనను టార్గెట్ చేశారని అలాగే పలు మీడియాల్లో వస్తోన్న కథనాలు కుట్రపూరితంగా వస్తోన్నవే అని యష్ చెప్పారు. అలాగే తనపై వస్తోన్న ఆరోపణలను ఎవరు నమ్మవద్దని ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చానని చెప్పారు. ఇక తన ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారని వస్తోన్న వార్తల్లో కూడా నిజంలేదని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని అన్నారు. 

కొన్ని మీడియా సంస్థలు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నట్లు చెప్పిన యష్ 40 కోట్ల కోట్ల ఋణం తీసుకున్నట్లు వస్తోన్న వార్తలు అబద్దమని ఖండించారు. అయితే యష్ సన్నిహితుల నుంచి ఐటి అధికారులు సేకరించిన డైరి గురించి కన్నడ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. యష్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో నిరసనలు తెలుపుతూ మద్దతుగా నిలుస్తున్నారు.   

loader