కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. లోకల్ సినిమాలుగా తెరకెక్కి..పాన్ ఇండియాన్ శేక్ చేస్తాయి. అలాంటి మూవీస్ లో కెజియఫ్ సిరీస్ మూవీస్ కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కెజియఫ్ సినిమాలు.. ప్రపంచ యాత్రకు బయలుదేరాయి.
కన్నడ నాట లోకల్ సినిమాగా తెరకెక్కి.. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది కెజియఫ్ సినిమా.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా.. అన్ని భాషల్లలో అదిరిపోయే రెస్పాన్స్ సాధించింది. ఇక ఆతరువాత భారీ అంచనాల నడుమ వచ్చిన కెజియఫ్ సీక్వెల్ మూవీ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసి.. అదరగొట్టింది. దాదాపు వెయ్యికోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి... కన్నడ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. అంతే కాదు బాహుబలి తరువాత సౌత్ నుంచి ఆరేంజ్ సిపిమాగా చరిత్ర సృష్టించింది కెజియఫ్.
కెజియఫ్ రెండుసినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి. ఇక భారీకలెక్షన్స్ సాధించిన ఈసినిమాలు రికార్డ్ బ్రేక్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ సినిమాలను జపాన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసందర్భంగా హీరో యష్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. యష్ మాట్లాడుతూ ఈ అద్భుతమైన యాక్షన్ చిత్రాలు మీకు కూడా నచ్చుతాయని భావిస్తున్నా. ఈ నెల 14న జపాన్ ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి. అంటూ ఓ వీడియో సందేశాన్ని రాక్ స్టార్ అందించారు.
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ముక్యంగా సౌత్ సినిమాలకు జపాన్ లో మంచిడిమాండ్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు , టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు, జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రిపుల్ ఆర్ తరువాత చరణ్, తారక్ కు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అటు బాలీవుడ్ సినిమాలు కూడా జపాన్ లో అత్యధిక కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఇదిలావుండగా తన తదుపరి చిత్రంపై హీరో యష్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన కేజీఎఫ్-3 కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు రాక్ స్టార్ యష్ నెక్ట్స్ సినిమాపై ఎప్పటినుంచో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా.. యష్ ఇంత కాలం అవుతున్న తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. అభిమానులు కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక ఆయన ఓ లేడీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. మరి త్వరలోనే యష్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తాడని చూస్తున్నారు.
