కన్నడలో మన సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ అయితేనే సాధారణంగా అక్కడ పెద్ద సినిమాలకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. అయితే మొదటిసారి ఒక శాండిల్ వుడ్ మూవీ తెలుగు సినిమాలను భయపెడుతోంది. అదే KGF మూవీ. కోలీవుడ్ లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. అయితే రివ్యూల పరంగా సినిమా బాలేదని వచ్చిన వార్తలకు ఇప్పుడు జనరల్ ఆడియెన్స్ నుంచి వస్తోన్న టాక్ కౌంటర్ గా మారింది. 

హీరో ఎలివేషన్ కమర్షియల్ మాస్ సీన్స్ జనాలను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమా జనాలకు నచ్చితే చాలు ఎవడు ఆపలేడు అన్న తరహాలో KGF సక్సెస్ గా ముందుకు సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి వారంలో 2 కోట్ల షేర్స్ ను అందుకోవడం విశేషం. ఇక బాలీవుడ్ లో అయితే ఎవరు ఊహించని విధంగా 10 కోట్ల గ్రాస్ ను దాటేసింది. తమిళనాడు లో పోటీ ఉన్నప్పటికీ మెల్ల మెల్లగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. 

టాలీవుడ్ లో గత వరం అంతరిక్షం - పడి పడి లేచే మనసు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలకు అందని ఆదరణ KGF కు అందుతోంది. సోమవారం కూడా పలు ఏరియాల్లో హౌస్ ఫుల్ థియేటర్స్ దర్శమనించాయి అంటే క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మొదటి సారి ఒక కన్నడ సినిమా అందరిని ఆకర్షించే విధంగా కలెక్షన్స్ సాధించడం చూస్తుంటే శాండిల్ వుడ్ నుంచి భవిష్యత్తులో మరిన్ని పెద్ద చిత్రాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.