కన్నడ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన నటుడు యష్. అతడు నటించిన 'కెజిఎఫ్'సినిమాను దాదాపు ఐదు భాషల్లో విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. దర్శకుడు రాజమౌళి స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ట్విట్టర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. దుబాయ్ లో ఉండే సినీ విశ్లేషకుడు, సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సందు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. హీరో యష్ బాగా నటించాడని, ఈ ఏడాదిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదేనంటూ పొగుడుతున్నారు.

నెటిజన్లు కూడా ఈ సినిమా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ ఊర మాస్ అని ట్వీట్లు చేస్తున్నారు. 1970 లలో కోలార్ బంగారుగనుల్లో పనిచేసే కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.