భారీ ప్లాన్ వేసిన యశ్, పాన్ ఇండియా హీరో కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్..
కెజియఫ్ సినిమా తరువాత యశ్ ఏ సినిమా చేసతాడా అనిఅంతా ఎదరు చూస్తుండగా.. కన్నడ యంగ్ స్టార్ మాత్రం ప్లాన్ భారీగానే వేశాడట. ఈసారి హాలీవుడ్ నుంచి హడావిడి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

కెజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్. ఈసినిమాతో ఇండియాలోనే కాకుండా పంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. కానీ యశ్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కేజీఎఫ్ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. దీంతో రాకీ భాయ్ అభిమానులంతా నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ ఎదురు చూస్తున్నారు.
అయితే ఫ్యాన్స్ ను చాలా కాలంగా వెయింటింగ్ లో పెట్టాడు ఈమధ్యే ఆయన తన ఫ్యాన్స్ కు తదుపరి సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు యష్. తాజాగా ఈ హీరో ఒక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తో కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోని ఆ స్టంట్ డైరెక్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘విత్ మై బ్రదర్’ అంటూ పోస్ట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈస్టంట్ మాస్టర్ పెట్టి పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు.. యశ్ సినిమాపై రకరకాల రూమర్స్ తిరుగుతున్నాయి.
ఇంతకీ ఆ స్టంట్ మాస్టర్ ఎవరంటే.. అవతార్, ఐరన్ మ్యాన్, జాన్ విక్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలకి పని చేసిన జేజేపెర్రీ . ఇతను దగ్గర యశ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడనేది సమాచారం. ఇక యశ్ 19వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది. యశ్ లేడీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతోందట. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. ఆమెతో యష్ దిగిన ఓ ఫోటో కూడా ఆ మధ్య నెట్టింట్లో బాగా తిరిగింది. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన గీతూమోహన్.. దర్శకురాలిగా మారి ఇప్పటివరకు మూడు సినిమాలు సక్సెస్ ఫుల్ గా చేసింది.
ఇక తాజాగా యష్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్టు సమాచారం. Yash19 వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ రూపొందుతోంది.ఈ మూవీ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్టు సమాచారం. అందుకే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను తీసుకున్నారట. ఇక ఈసినిమా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనుందని, అక్టోబర్ లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక అప్డేట్ రానుందని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం.