కెజిఎఫ్ చిత్రంతో తిరుగులేని హీరోగా మారిపోయాడు యష్. కెజిఎఫ్ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా ఘనవిజయం సాధించింది. దీనితో కెజిఎఫ్ చాప్టర్ 2పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంతో యష్ మాస్ ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. 

ఇదిలా ఉండగా యష్ కుటుంబానికి అధిక ప్రధాన్యత నిచ్చే హీరో. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటాడు. నటి రాధికా పండిట్ ని యష్ 2016లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించింది. పాప పేరు ఐరా. తన భర్త కంట తొలిసారి కన్నీరు చూశానని అంటోంది రాధికా పండిట్. ఇటీవల ఐరాకు చెవి పోగులు కుట్టించారట. 

ఆ సమయంలో నొప్పితో ఐరా ఏడుస్తుంటే తల్లిదండ్రులుగా తాము తల్లడిల్లిపోయామని రాధిక తెలిపింది. యష్ కన్నీరు పెట్టుకున్నారు. బంధాల విలువ మరోసారి తెలిసింది. అభిమానులని ఉద్దేశిస్తూ మీరేం బాధపడకండి.. తండ్రి కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు అని ఐరా ఫోటోలని సోషల్ మీడియాలో రాధిక పోస్ట్ చేసింది.