అసిస్టెంట్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన హీరో యష్, స్వయంగా ఇంటికి వెళ్ళి..
ఎంత స్టార్ హీరోలయినా.. తమ కింద పనిచేసేవారికి రెస్పెక్ట్ ఇస్తుంటారు. కొంత మంది మాత్రం వారిని దూరంగా ఉంచుతారు.. మరికొంత మంది మాత్రం అసిస్టెంట్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. తాజాగా కన్నడ రాక్ స్టార్ యషక్ కూడా అదే పని చేశారు.
కేజీఎఫ్ సిరీస్ తో రాకింగ్ స్టార్ గా మారిపోయాడు యశ్.. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కర్నాటకలో తప్పించి దేశానికి తెలియని కన్నడ ఇండస్ట్రీని పాన్ఇండాయాకు పరిచయం చేశాడు యష్. ఈ దెబ్బతో ఇండియాన్ స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు. దీంతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అయితే కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఈ రాకింగ్ స్టార్. ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు యష్. ఇప్పటికీ యధ్యతరగతి జీవితం అంటేనే అతనికి ఇష్టం. అందుకే తన దగ్గర పనిచేసే వారికి కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. వారిక బాగోగులు చూస్తాడు. తాజాగా తన దగ్గర పనిచేసే తన అసిస్టెంట్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు యష్. ఇంత బిజీ టైమ్ లో కూడా తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. తన కోసం పనిచేసే వారిని ఎన్నటికీ మర్చిపోకూడదని చాటిచెప్పాడు. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. యష్ రావడంతో వారి సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. అంతే కాదు అసిస్టెంట్ బాబుకు కూడా భారీ బహుమతి ఇచ్చాడు.
సెలబ్రిటీలు తమ కోసం పనిచేసే వారికి ఎప్పుడూ అండగా ఉంటూనే ఉంటారు. మన దగ్గర అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, చరణ్ లాంటివారు ఇలానే వారి దగ్గర పనిచేసేవారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు.. వారి ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ కు కూడా వెళ్తూ.. హడావిడి చేస్తుంటారు. వారి ఇంట్లో చిన్న వేడుక జరిగినా హాజరై.. తమ మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు సడెన్ సర్ఫ్రైజ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన అసిస్టెంట్ చేతన్ కు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చాడు. యశ్ దగ్గర చేతన్ దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యశ్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి అతనితోనే ట్రావెట్ చేస్తున్నాడు.
ఎన్ని ఇబ్బందులు వచ్చి.. ప్లాప్ లు వచ్చినా... తనను వీడి వెళ్ళిపోలేదు. కాగా 2021లో చేతన్ వివాహం జరిగింది. ఆ పెళ్లికి సైతం యశ్ దంపతులు వచ్చి.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. దీంతో అప్పుడు అందరూ యశ్ మంచి మనసును ప్రశంసించారు. తాజాగా మరోసారి యష్ చేతన్ ఇంటికి వెళ్లాడు. సడెన్ గా వెళ్లి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. అసిస్టెంట్ చేతన్ దంపతులకు కొన్ని రోజుల క్రితం కుమారుడు జన్మించాడు. అయితే టాక్సిక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో.. వెళ్లలేకపోయాడు యశ్. కానీ తాజాగా సడెన్ గా ఇంటికి వెళ్లి.. వారి కొడుక్కి బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు.
దాంతో చేతన్ దంపతులుదిల్ ఖుష్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు యశ్ సింప్లిసిటీపై అలాగే గోల్డ్ చైన్ బహుమతిగా ఇవ్వడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగుండే తీరు, అందరిని కలుపుకొని పోయే తీరు ఆయనదని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.