కేజీఎఫ్ హీరో యష్ గురించిన ఓ వార్త ఇప్పుడు కన్నడ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని యష్  ఓ ఫిల్మ్ మేకర్ కు రికమెండ్ చేసారని. అదేంటి ప్రభాస్ లాంటి స్టార్ ని యష్ రికమెండ్ చేయటం ఏమిటి అని ఆరా తీస్తే... తెలిసిన విషయం ఏమిటీ అంటే...కన్నడ స్టార్ డైరక్టర్ ఒకరు యష్ ని ఓ ఇంట్రస్టింగ్ స్టోరీతో, పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథతో ఎప్రోచ్ అయ్యారట.

కేజీఎఫ్ చూసి ఆ ఇమేజ్ ని మించే కథ ఇది అని ఆయన ఫీలయ్యి స్టోరీ మొత్తం నేరేట్ చేసారట. అయితే కథ మొత్తం విన్న యష్ ఆ స్దాయికు తన ఇమేజ్ సరిపోదని, బాహుబలి చేసిన ప్రభాస్ అయితే ఫెరఫెక్ట్ అని చెప్పారట. అంతేకాక ప్రభాస్ కు ఫోన్ చేసి ఓ కథ వినమని సజెస్ట్ చేసారట. దాంతో  ఆ కన్నడ డైరక్టర్ ఫుల్ ఆనందపడిపోయారట. యష్ గురించి అందరికి చెప్పారట.

తను ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించటం అంటే అంత తేలిగ్గా జరిగే పని కాదని, అది యష్ కు కథ చెప్పటం వలనే జరిగిందని అంటున్నారట. త్వరలోనే ప్రభాస్ కు ఆయన కథ చెప్పారని కన్నడ మీడియా అంటోంది. అన్ని ఫెరఫెక్ట్ గా సెట్ అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ సినిమా రిలీజ్ తర్వాత పట్టాలు ఎక్కుతుందంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే నిర్మాతలుకు కొదవ ఉండదు. కోట్లు గుమ్మరిస్తారు.