కెజిఎఫ్ మూవీ సంచనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన ప్రతి భాషలో బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసిన కెజిఎఫ్...  హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ లను దేశవ్యాప్తంగా పాప్యులర్ చేసింది. ప్రశాంత్ నీ తీసింది రెండు సినిమాలే అయినా ఆయనకు ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఆఫర్స్ దక్కుతున్నాయి. కెజిఎఫ్ 2 విడుదల కాకుండానే ప్రశాంత్ నీల్ పై నమ్మకంతో నిర్మాతలు భారీ ప్రాజెక్ట్స్ చేయడం విశేషం. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన ప్రశాంత్, నెలల వ్యవధిలో మరో టాప్ స్టార్ ఎన్టీఆర్ తో మూవీ కన్ఫర్మ్ చేశారు. సలార్ మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖనిలో గల మైనింగ్ ఏరియాలో సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే నాడు ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం ఆయనతోనే అని అధికారికంగా ప్రకటించారు. 


ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ సైతం భారీ బడ్జెట్ తో హెవీ స్కేల్ లో తెరకెక్కనుంది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేసిన ఈ ప్రాజెక్ట్ 2022లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇటీవల బర్త్ డే జరుపుకున్న ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ తదుపరి చిత్రాలకు కావాలనే ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్ ని ఎంచుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. 


ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద స్టార్స్ ని ఎంచుకునే స్థాయిలో నేను లేను, ఇంకా అంత ఎత్తుకు నేను ఎదగలేదు. కథలు వారికి నచ్చడంతో ఈ కాంబినేషన్స్ సెట్ అయ్యాయని అన్నారు. పరోక్షంగా సదరు స్టార్స్ నాతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతోనే ఈ ప్రాజెక్ట్స్ సాధ్యం అయ్యాయని పరోక్షంగా తెలిపారు. ఇక యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఎప్పుడు విడుదలైనా, కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.