‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’తో ఇండస్ట్రీ మెత్తం కన్నడ చలన చిత్ర పరిశ్రమవైపు చూసేలా చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ‘కేజీఎఫ్2’ కూడా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా.. ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు తెలుస్తోంది. 

కన్నడ ఇండస్ట్రీని నుంచి భారీ అంచనాలతో కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf Chapter 2) ఈ రోజు గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel), యష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మొదటి రోజు సినిమాను చూసేందుకు వరల్డ్ వైడ్ 40 లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు. హై ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా అంచనాలను మించియేలా కనిపిస్తోంది. 

అయితే, ఇప్పటికే ప్రీమియర్ షో రిలీజ్ కాగా.. బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుందీ చిత్రం. బహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి పోటీగా మరే సినిమా లేదనే చెప్పాలి. మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ RRR చిత్రం కూడా దూకుడును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆడియెన్స్ చూపు మొత్తం కేజీఎఫ్ ఛాప్టర్ 2పైనే ఉంది. అయితే ప్రీమియర్ షో ద్వారా కేజీఎఫ్ ఛాప్టర్ 3 (KGF Chapter 3) కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పవర్ ఫుల్ పొలిటిషన్ రోల్ పోషిస్తున్న రవీనా టండన్ (Raveena Tandon) కేజీఎఫ్ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో.. కవర్ పేజీని తిప్పే క్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 అని కనిపించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 వస్తుందనేది అర్థమవుతోంది. అయితే Kgf2 ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 3పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ‘సార్ కేజీఎఫ్ 3 కూడా రానుందా?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘ఏమో చూడాలి.. ఛాప్టర్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది’ అంటూ బదులిచ్చారు. ఈ కామెంట్ తోనే కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు అర్థమైంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోతో అది కన్ఫమ్ అయ్యింది. కానీ కేజీఎఫ్ మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Scroll to load tweet…

కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఈ రోజు ( ఏప్రిల్ 14న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ భారీ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యష్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి (SriNidhi Shetty) ఆడిపాడుతోంది. సంజయ్ దత్ మరియు రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఛాప్టర్ 2లో రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Scroll to load tweet…