అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని మే 30న అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయటానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. 

ఇక ఈ రిలీజ్ డేట్ విషయాన్ని నిర్మాతలు...తమ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే పంపిణీదారులకు తెలియచేసారు. తెలుగులో ఈ సినిమాని సాయి కొర్రపాటి రిలీజ్ చేయనున్నారు. ఆయన ఈ చిత్రం మొత్తం రైట్స్ తీసుకున్నారు.  ఇప్పుడు జిల్లాల వారీగా ఈ సినిమాని అమ్ముతున్నారు. చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందు, వెనక ఆలోచిస్తున్నారు. 
 
`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
  
 కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్  కోసం వేచి చూద్దాం.