కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్ల వర్షం కురిపిస్తుంది. వందల కోట్ల వసూళ్లు అవలీలగా దాటేస్తుంది. నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది.  

యష్ (Yash)-ప్రశాంత్ నీల్ (Prashanth neel)కాంబినేషన్ లో తెరకెక్కిన కెజిఫ్ 2 విజయాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. ఊహకు మించిన రెస్పాన్స్ ఈ సినిమా దక్కించుకుంటుంది. మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న కెజిఎఫ్ 2 వసూళ్లలో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా హిందీలో ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో కెజిఎఫ్ 2 రూ. 193 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆదివారం రూ. 53.35 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ రెండు వందల కోట్ల వసూళ్లకు చేరువైంది. 

సోమవారం కెజిఎఫ్ 2(KGF Chapter 2) హిందీ వర్షన్ రూ. 200 కోట్లను దాటివేయనుంది. ఇక తమిళనాడు నాలుగు రోజులకు గానూ... రూ. 42.73 కోట్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కెజిఎఫ్ 2 దాదాపు రూ. 551 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. వీకెండ్ ముగిసే నాటికే ఇంత భారీ మొత్తంలో వసూళ్లు సాధించిన నేపథ్యంలో వెయ్యి కోట్లు వసూళ్లు అవలీలగా చేరుకుంటుదనిపిస్తుంది. రోజురోజుకూ కెజిఎఫ్ 2 చిత్ర వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి. 

తెలుగులో కూడా ఈ చిత్ర జోరు అదే స్థాయిలో ఉంది. నైజాంలో కెజిఎఫ్ రూ. 27.9 కోట్ల షేర్ వసూలు చేసింది. 25 కోట్లకు నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అంటే నాలుగు రోజుల్లోనే ఆయన పెట్టుబడి తిరిగొచ్చేసింది. అంటే ఇకపై కెజిఎఫ్ వసూళ్ళని లాభాలుగానే పరిగణించాలి. మొత్తంగా కెజిఎఫ్ 2 బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది. నిర్మాతలు, బయ్యర్ల కళ్ళలో ఆనందం నింపుతుంది.