కన్నడ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రం 'కేజీఎఫ్'. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. ఇటీవలే 'కేజీఎఫ్ 2' సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ సినిమా నటించడానికి ఆసక్తిగా ఉన్నవాళ్లు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

8 నుండి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు, 25 సంవత్సరాలు పైబడిన పురుషులు కావాలని ప్రకటన విడుదల చేశారు. అయితే ఆడిషన్ వచ్చే ముందు నిమిషం పాటు ఏదైనా డైలాగ్స్ ని నేర్చుకొని రావాలని సూచించారు.

ఈ ఆడిషన్స్ బెంగుళూరులోని జీఎం రిజాయిస్ లో ఏప్రిల్ 26న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కేజీఎఫ్ చాప్టర్ 1 పెద్ద సక్సెస్ కావడంతో భారీ బడ్జెట్ తో సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు కూడా కనిపించబోతున్నారని సమాచారం.