కాస్త రొటీన్ గా అనిపించినా సినిమాలకు నెగిటివ్ రివ్యూలు రావడం సహజం. అయితే సగటు ప్రేక్షకుడు మాత్రం సినిమా రిలీజ్ తరువాతే సినిమా రిజల్ట్ ఏంటో చేప్పేస్తాడు. KGF విషయంలో అదే జరిగింది. సినిమా పరమ చెత్తగా ఉందంటూ కొంతమంది రివ్యూ రాజాలు బాగానే కామెంట్స్ చేశారు. యావరేజ్ గా కూడా లేదంటూ హైప్ క్రియేట్ చేసిన  సినిమా బోల్తా కొట్టినట్లు మాట్లాడారు. 

అయితే రివ్యూలా ఎఫెక్ట్ సినిమాపై కొంచెం కూడా పడలేదు. ఆడియెన్స్ యాష్ మాస్ అండ్ యాక్షన్ అంశాలకు ఫిదా అయ్యారు. సినిమా రోజురోజుకి కలెక్షన్స్ తో గట్టి కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ గా అమెజాన్ లో వచ్చిన ఈ సినిమాకు మరోసారి బారి స్పందన వచ్చింది. చూసిన వారు మరోసారి అమెజాన్ ప్రైమ్ లో తెగ చూసేస్తున్నారు. 

ఇప్పటికి KGF థియేటర్స్ లో తెగ ఆడుతోంది. బాహుబలి అనంతరం ఒక డబ్బింగ్ సినిమా హిందీ ఇతర భాషల్లో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. 250 కోట్ల కలెక్షన్స్ ని దాటడమే కాకుండా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కోట్ల సంఖ్యలో జనాలు సినిమాను మరోసారి వీక్షించారు. బాహుబలి అనంతరం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ఎక్కువా మంది KGF నే టార్గెట్ చేశారు. మొత్తానికి బాగాలేదని చెప్పిన రివ్యూలకు ఇది మాములు దెబ్బ కాదనే చెప్పాలి. ఒక సినిమా ఆడియెన్స్ కి నచ్చితే దాన్ని ఎవడు ఆపలేడని KGF నిరూపించింది.