ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్స్ నుంచి కిందస్థాయి నటుల వరకూ చాలా మంది ఈలోకాన్ని వదిలి పెళ్లిపోతున్నారు. రీసెంట్ గా కన్నడ నటుడు, కెజియఫ్ ఫేమ మోహన్ జునేజా కన్నుమూశారు.
ప్రముఖ కన్నడ నటుడు మోహన్ జునేజా కన్నుమూశాడు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. సిరీయల్ యాక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించిన మోహన్ చాలా తక్కువ కాలంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కన్నడాలో మంచి నటుడిగా మోహన్ కు ఇమేజ్ ఉంది. ఇప్పటివరకు మోహన్ జునేజా దాదాపుగా 100కు పైగా సినిమాలలో నటించాడు. చివరగా ఈయన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్-2 లో నటించి మెప్పించాడు. మోహన్ జునేజామరణం పట్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ లోకి వెళ్ళిపోయింది. అంతే కాదు కెజియఫ్ టీమ్ తో పాటు కన్నడ పరిశ్రమ నుంచి స్టార్స్ అంతా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
ఇక కన్నడ నటుడు మోహన్ జునేజా వివారాలు చూస్తే.. ఆయన కర్ణాటకలోని తుమ్‌కూర్ జిల్లాలో జన్మించాడు. నటన పైన ఆససక్తితో ప్రయత్నం చేయగా.. సీనియల్స్ లో ఆయనకు అవకాశం వచ్చింది. బుల్లితెరపై నటిస్తూనే.. చిన్నగా సిల్వర్ స్క్రీన్ మీదకు చేరారు మోహన్. చెల్లాట సినిమాతో ఈయనకు కన్నడలో మంచి గుర్తింపు వచ్చింది. ఒక విధంగా ఈయన కెరీర్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
చెల్లాట సినిమాలో మోహన్ కమెడీయన్ పాత్రలో నటించాడు. ఇక ఆతరువాత వరుసగా మస్తీ, రామ్‌లీలా,బచ్చన్, కేజీఎఫ్ లాంటి సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ చిత్రంతో ఈయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గ్యాంగ్‌తో వచ్చే వాడు గ్యాంగ్ స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు మాన్‌స్టర్... అంటూ మోహన్ జునేజా చెప్పిన డైలాగ్ కన్నడ తో పాటు తెలుగో కూడా పాపులర్ అయ్యింది. అటువంటి నటుడు మరణించడంతో కన్నడతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.
