Asianet News TeluguAsianet News Telugu

KGF కలెక్షన్స్: సందు చూసి కొట్టిన యాష్!

టాలీవుడ్ లో మొదటి సారి ఒక కన్నడ సినిమా KGF బయ్యర్స్ కి ఊహించని లాభాలను అందించింది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని యాష్ ఈ ఒక్క సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కేజీఎఫ్ గట్టిగానే ఆడేస్తోంది. 

KGF 2 WEEKS COLLECTIONS
Author
Hyderabad, First Published Jan 4, 2019, 4:35 PM IST

టాలీవుడ్ లో మొదటి సారి ఒక కన్నడ సినిమా KGF బయ్యర్స్ కి ఊహించని లాభాలను అందించింది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని యాష్ ఈ ఒక్క సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కేజీఎఫ్ గట్టిగానే ఆడేస్తోంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ కన్నడ సినిమా రెండే వారాల షేర్స్ 10 కోట్ల మార్క్ ను దాదాపు టచ్ చేసినట్లే. సంక్రాంతి వరకు KGF సినిమా కలెక్షన్స్ తగ్గేలా లేవు.  రెండు పెద్ద సినిమాలు(పడి పడి లేచే మనసు - అంతరిక్షం) డిఫరెంట్ జానర్ లో రిలీజైనప్పటికీ యాష్ సినిమాపై ప్రభావం చూపలేకపోయాయి. సందు చూసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ సినిమాకు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా సినిమా సక్సెస్ అని నిరూపించుకుంది. 

టోటల్ గా ఎపి తెలంగాణలో KGF (రెండు వారాల) షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.              

నైజామ్: 3.94 cr 

సీడెడ్: 1.82 cr 

ఉత్తరాంధ్ర: 1.09 cr

ఈస్ట్ : 0.54 cr 

వెస్ట్: 0.47 cr 

కృష్ణ: 0.81 cr 

గుంటూరు: 0.69 cr 

నెల్లూరు: 0.23 cr  

ఏపీ + తెలంగాణాలో మొత్తం డిస్ట్రిబ్యూటర్ షేర్స్: రూ. 9.59cr 

Follow Us:
Download App:
  • android
  • ios