విడుదలై నాలుగు వారాలవుతున్నా కెజిఎఫ్ 2 జోరు తగ్గలేదు. హిందీలో ఈ మూవీ ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ వీకెండ్ కూడా కెజిఎఫ్ 2దే అయ్యింది.
కెజిఎఫ్ 2 (KGF 2 collections)నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. నాలుగో వారం కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. శుక్రవారం రూ. 3.85 కోట్లు, శనివారం రూ. 4.75 ఆదివారం రూ. 6.25 కోట్లు రాబట్టింది. స్టార్ హీరోల డైరెక్ట్ చిత్రాలు మొదటి రోజు కూడా ఈ మాత్రం వసూళ్లు రాబట్టలేకపోవడం విశేషం. అటాక్, హీరోపంతి 2 చిత్రాలకు కనీసం మూడు కోట్ల ఓపెనింగ్ కలెక్టన్స్ రాలేదు. అలాంటిది డబ్బింగ్ మూవీ కెజిఎఫ్ నాలుగో వారం ఆరు కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.
ఇక మొత్తంగా ఇప్పటి వరకు కెజిఎఫ్ హిందీ వర్షన్ రూ. 412.80 కోట్ల వసూళ్లు సాధించింది. లేటెస్ట్ హాలీవుడ్ మూవీ డాక్టర్స్ స్ట్రేంజ్ నుండి కెజిఎఫ్ 2 గట్టిపోటీ ఎదుర్కొంటుంది. ఆ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్స్ తగ్గించారు. లిమిటెడ్ థియేటర్స్, షోస్ తో కూడా కెజిఎఫ్ 2 చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. మొత్తంగా కెజిఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేసిన ఈ చిత్రం బాహుబలి 2 తర్వాత భారీ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
2018లో విడుదలైన కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 తెరకెక్కింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అతిపెద్ద విజయం అందుకుంది. మొదటి పార్ట్ కి పది రెట్లు అధికంగా కలెక్టన్స్ రాబట్టింది. హీరో యష్ ఈ రెండు చిత్రాలతో దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అవతరించాడు. సంజయ్ దత్ విలన్ గా నటించిన కెజిఎఫ్ 2లో రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు.
కెజిఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో చేస్తున్న మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ తెరకెక్కుతుంది. షూటింగ్ కొంత భాగం పూర్తి కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సలార్ విడుదల కానుంది.