బాలీవుడ్ పై సౌత్ చిత్రాల ఆధిపత్యం కొనసాగుతోంది. మూడు వారాల తర్వాత కూడా కెజిఎఫ్ 2 జోరు అక్కడ తగ్గలేదు. లేటెస్ట్ విడుదలైన చిత్రాలకు చుక్కలు చూపిస్తూ సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.
బాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మూవీ సత్తా చాటింది. రూ. 250 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ థియేటర్స్ లో ఉండగానే కెజిఎఫ్ 2 విడుదలైంది. ఆర్ ఆర్ ఆర్ కి మించిన ఆదరణ కెజిఎఫ్ 2 కి దక్కింది. నార్త్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఓపెనింగ్ డే ఆల్ టైం రికార్డు నమోదు చేసిన కెజిఎఫ్ 2 బాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. రూ. 350 కోట్ల వసూళ్లను దాటేసిన ఈ చిత్రం రూ. 400 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.
కెజిఎఫ్ 2 (KGF 2) తర్వాత విడుదలైన హిందీ చిత్రాలేవీ ఈ సినిమా ముందు నిలవలేకపోయాయి. గత వారం విడుదలైన జెర్సీ డిజాస్టర్ ఖాతాలో చేరింది. తెలుగులో హిట్టైన జెర్సీ చిత్ర రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీకి కనీస ఆదరణ దక్కలేదు. ఇక ఈ వారం హిందీలో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. అజయ్ దేవ్ గణ్, అమితాబ్ బచ్చన్ నటించిన రన్ వే 34(Heropanti 2), టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన హీరోపంతి 2 విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాయి.
రన్ వే 34( Run way 34) రూ. 3 కోట్లు, హీరోపంతి రూ. కోట్లు ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ చిత్రాలకున్న హైప్ తో పోల్చితే చాలా తక్కువ వసూళ్లు రాబట్టినట్లు లెక్క. మరోవైపు మూడో వారం కూడా కెజిఎఫ్2 సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. మూడవ శుక్రవారం రూ. 4.25 కోట్లు రాబట్టిన ఈ మూవీ శనివారం దాదాపు రెట్టింపు వసూళ్లు రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం కలదు. రంజాన్ పండుగను కూడా కెజిఎఫ్ 2 క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రన్ వే 34, హీరోపంతి 2 పూర్ ఓపెనింగ్స్ తో ప్లాప్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక 400 కోట్లకు దగ్గరవుతున్న కెజిఎఫ్ 2 మరికొన్ని రోజులు బాలీవుడ్ లో సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ 2 వసూళ్లు వెయ్యి కోట్లు దాటేసిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ , కెజిఎఫ్ 2 సక్సెస్ తో బాలీవుడ్ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి. సౌత్ సినిమానా గొప్పా, నార్త్ సినిమా గొప్పా అనే చర్చ కొనసాగుతుండగా... కెజిఎఫ్ 2 ప్రభంజనం ప్రాధాన్యత సంతరించుకుంది.