బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో సత్తా చాటిన సౌత్‌ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన చిత్రయూనిట్ తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్‌ చేశారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా హీరో యష్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా మార్చేసింది.

దీంతో కేజీఎఫ్ 2 మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తొలి భాగం బాలీవుడ్ రికార్డ్‌ వసూళ్లు సాధించటంతో సీక్వెల్ విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ కూడా ఇంట్రస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కేజీఎప్‌ 2లో విలన్‌గా నటించేందుకు అంగీకరించాడు. తొలి భాగంలో కొన్ని సీన్స్‌లోనూ అది కూడా వెనుక నుంచి మాత్రమే కనిపించిన అధీరా క్యారెక్టర్‌ సీక్వెల్‌లో మెయిన్ విలన్‌గా కనిపించనుంది.

ఆ పాత్రలో సంజయ్‌ దత్‌ నటించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ లుక్‌ను రివీల్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ముఖం మీద టాటూ, డిఫరెంట్ హెయిర్‌ స్టైల్‌, చేతిలో పెద్ద కత్తిలో సంజయ్‌ దత్‌ లుక్‌ భయానకంగా ఉంది. యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్ ఈ సినిమాలో రవీనా టండన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రవీ బస్రూర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.