రీసెంట్ గా రిలీజ్ అయ్యి రికార్డ్ ల మీద రికార్డ్ లు సాధిస్తోంది కెజియఫ్2 సినిమా. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమూవీ సరికొత్త చరిత్ర రాసింది. కాని బాహుబలి రికార్డ్ ను మాత్రం హందీలో బీట్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు మరోక కొత్త ప్రయత్నంలో ఉన్నారు కెజియఫ్ టీమ్.  

కన్నడ యంగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను కూడా దాటుకుని కేజీఎఫ్ 2 దూసుకుపోతోంది. అటు బాలీవుడ్ సినిమా దంగల్ హిందీ రికార్డు ను సైతం ఏకంగా కేజీఎఫ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు దంగల్, బాహుబలి 2 పేరిట ఉన్న వరల్డ్ రికార్డు లను కూడా బ్రేక్ చేయాలని చూస్తోంది కెజియఫ్ టీమ్. దాని కోసం ప్రయత్నాలు కూడా మోదలయినట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపం వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాహుబలి కూడా జపాన్ లాంటి దేశాల్లో తన సత్తా చాటింది. ప్రభాస్ కు విదేశీ ఫ్యాన్స్ ను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వబోతుననారు కేజీఎఫ్ 2 టీమ్. ఈసినిమాను విదేశాల్లో ఆయా భాషలలో రిలీజ్ చేస్తే.. డాలర్లరూపంలో కలెక్షన్ల దండిగా వస్తాయని.. డాలర్లు వసూళ్లు గా నమోదు అయ్యే అవకాశం ఉంది.. దాంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు టీమ్. 

విదేశాల్లో కెజియఫ్2కు మంచి రెస్పాన్స్ వస్తే.. మాత్రం కలెక్షన్లు గట్టిగా వచ్చి.. కేజీఎఫ్ కు అరుదైన రికార్డు లు మరిన్ని దక్కే అవకాశం ఉందంటున్నారు మేకర్స్. ఇప్పటికే సౌత్ కొరియా లో కేజీఎఫ్ 2 ను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అక్కడ పెద్ద ఎత్తున చేశారు టీమ్. కేవలం కొరియన్ భాషలోనే కాకుండా మరి కొన్ని భాషల్లో మరి కొన్ని దేశాల్లో సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కేజీఎఫ్ 2 మేకర్స్ ఉన్నారు. 

అయితే కెజియఫ్ 2 చూడాలి అంటే ఫస్ట్ పార్ట్ మూవీ తెలిసి ఉండాలి.. లేకుంటే సెకండ్ పార్ట్ మూవీ పెద్దగా అర్ధం కాదు.. కెజియఫ్ ఫస్ట్ పార్ట్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాని ఆ సినిమాను విదేశాల్లో విడుదల చేయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ 2ను అక్కడ విడుదల చేయబోతున్నారు. కెజియఫ్ 2 ను అక్కడ రిలీజ్ చేయడం కోసం కెజియఫ్ ఫస్ట్ పార్ట్ కథను వారికి ముందు గానే 5 నిమిషాల పాటు చూపిస్తారట.

కెజియఫ్ 2 సినిమా కొరియన్ భాష లో సక్సెస్ అయితే ఖచ్చితంగా చైనా లో కూడా రిలీజ్ చేయడం కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా చైనా ఇండియా మద్య సన్నిహిత సంబంధాలు లేవు. దాంతో సినిమా లు విడుదల కావడం లేదు. కాని ఇప్పుడు ఈ సినిమా ను అక్కడ విడుదల చేసే విధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

చైనాలో కెజియఫ్ 2 రిలీజ్ కాకున్నా కూడా కచ్చితంగా ఇతర భాషల్లో మరియు దేశాల్లో విడుదల అయినా కూడా భారీ గా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందంటన్నాయి ఇండస్ట్రీ వర్గాలు.కెజియఫ్ 2 ఫారెన్ లో దుమ్ము రేపితే.. బాహుబలి రికార్డ్స్ కు గండి పడినట్టే... చూడాలి కెజియఫ్2 ఫారెన్ రిపోర్డ్స్ ఎలా ఉంటాయో.