రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లోని షిప్ సీక్వెన్స్ బాగా ట్రోల్ చేయబడింది. అదే KGF2 లో షిప్ సీక్వెన్స్ కూడా ట్రోల్ చేసే అవకాసం ఉంది , దాని కంటెంట్ అలాంటిది.
సౌత్ నుంచి నార్త్ దాకా మొత్తం కలెక్షన్స్ తో దుమ్ము రేపుకుంటూ పోతున్నాడు రాఖీభాయ్. కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. కేజీఎఫ్ చాప్టర్‌కు 1కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ చిత్రం. కొత్త రికార్డ్ లు ను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు కొన్ని కలిసి వచ్చాయంటున్నారు. ముఖ్యంగా ట్రోలర్స్ ఈ సినిమాపై దయతలిచారంటున్నారు.
కెజిఎఫ్ 2 లో వాస్తవానికి కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి. ఉదాహరణకు, ఈ ఒక్క సీన్ లో రాకీ భాయ్ భారత పార్లమెంటు లోపల కాల్పులు జరిపి, అప్పటి ప్రధానమంత్రి వెనుక కూర్చున్న మాజీ ప్రధానిని కాల్చి చంపేస్తాడు. అదే ఏ తెలుగు సినిమాల్లో ఉండి ఉంటే ఈ పాటికి ఓ రేంజిలో ట్రోలింగ్ జరిగేది. అలాగే అంతర్జాతీయ జలాల్లో సెట్ చేయబడిన షిప్ సీక్వెన్స్ ఉంది. నావల్టీ ఉంది కానీ కన్వీన్సింగ్ గా ఉండదు. అయితే లక్కిగా ఈ సీన్ ని ఎవరూ ట్రోల్ చేయలేదు.
అదే రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లోని షిప్ సీక్వెన్స్ బాగా ట్రోల్ చేయబడింది. అదే KGF2 లో షిప్ సీక్వెన్స్ కూడా ట్రోల్ చేసే అవకాసం ఉంది , దాని కంటెంట్ అలాంటిది. అదృష్టవశాత్తూ KGF 2 కోసం, ఈ లాజిక్ లేని సీన్స్ కన్నా కమర్షియల్ గా ప్యాక్ చేయబడిన హై వోల్టేజ్ సన్నివేశాల ఎక్కువగా ఉండటం కలిసొచ్చింది. అదే తెలుగు స్టార్ ఎవరైనా అలాంటి సీన్స్ చేసి ఉంటే, ఖచ్చితంగా చాలా దారుణంగా ట్రోల్ చేయబడేవారనటంలో సందేహం లేదు.
ఏదైమైనా వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది కేజీఎఫ్ చాప్టర్ 2. కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.552 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి!
