కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ఒక ముద్ర వేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ను సిద్ధం చేసుకుంది. గత కొంత కాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథపై చాలా కసరత్తులు చేసి మరి సినిమా స్క్రిప్ట్ ను మరింత బలంగా మార్చాడు. 

ఛాప్టర్ 1 200 కోట్లను ఈజీగా దాటేయడంతో ఈ సారి మరింత ఖర్చు చేసి సినిమా స్కెల్ కు తగ్గట్టు లెక్కలు అన్ని సెట్ చేసుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా సగం బడ్జెట్ ఫైట్స్ కోసమే ఖర్చు చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ కోసం 60 నుంచి 70 కోట్ల మధ్యలో ఖర్చు చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం 100 కోట్లయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. 

ఇక అధికారికంగా నేడు పూజా కార్యక్రమాలతో సినిమా సీక్వెల్ ను లాంచ్ చేశారు. ఇక మరికొన్నిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ముందే 15% సీక్వెల్ కి సంబందించిన సీన్స్ ను తెరకెక్కించిన చిత్ర యూనిట్ ఇప్పుడు మిగతా షూటింగ్ కు ప్లానింగ్ గీసుకుంది. పక్కా ప్రణాలికలతో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు సమాచారం.