సారాంశం
కేతిక శర్మ కి గ్లామర్ ఉన్నప్పటికీ ఆమెకు సరైన సక్సెస్ దక్కడం లేదు. కేతిక శర్మ తన కెరీర్లో రొమాంటిక్, రంగ రంగ వైభవంగా, బ్రో ఇలాంటి చిత్రాల్లో నటించింది.
యంగ్ హీరోయిన్ కేతిక శర్మ ప్రస్తుతం శ్రీ విష్ణు సరసన సింగిల్ చిత్రంలో నటిస్తోంది. మే 9న అంటే మరి కొన్ని గంటల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కేతక శర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. కేతిక శర్మ కి గ్లామర్ ఉన్నప్పటికీ ఆమెకు సరైన సక్సెస్ దక్కడం లేదు. కేతిక శర్మ తన కెరీర్లో రొమాంటిక్, రంగ రంగ వైభవంగా, బ్రో ఇలాంటి చిత్రాల్లో నటించింది.
ఆ చిత్రలేవి విజయం సాధించలేదు. దీంతో కేతిక శర్మ అసలు మొత్తం సింగిల్ చత్రం పైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో కేతిక శర్మ రాబిన్ హుడ్ చిత్రంలో అదిదా సర్ ప్రైజు సాంగ్ వివాదంపై స్పందించింది. ఆ మూవీలో కేతికా శర్మ అదిదా సర్ ప్రైజు ఐటమ్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో ఆమె చేసిన హుక్ స్టెప్పు తీవ్ర వివాదానికి కారణమైంది.
దీనిపై కేతిక స్పందిస్తూ అదిదా సర్ ప్రైజు సాంగ్ ఇంత పెద్ద రచ్చ అవుతుందని అసలు ఊహించలేదని తెలిపింది. ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నాతోపాటు చిత్ర యూనిట్ మొత్తం అసలు వివాదం అవుతుందని అనుకొనే లేదు. ఆడియన్స్ ఎంజాయ్ చేసే సాంగ్ అవుతుందని భావించాం. కానీ ఆ స్టెప్ వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారని తెలిసి బాధపడ్డాను. నా కెరీర్లో ఇదొక అనుభవం. ఒడిదుడుకుల వల్లే ఎదుగుదల సాధ్యమవుతుంది.
తాను గ్లామర్ పాత్రలతో మాత్రమే కాకుండా సాయి పల్లవి కీర్తి సురేష్ తరహాలో నటనతో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాను. లేడీ ఓరియంటెడ్ కథలు వస్తే తప్పకుండా చేస్తాను అని కేతిక శర్మ పేర్కొంది.